అలా చేయడం వల్ల లావణ్యకి 3 కోట్లు ఫైన్

lavanya tripati

అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాల్లో అవకాశాలు కొట్టేసి టాప్ లిస్టులో చేరిపోయింది. సొగ్గాడే చిన్ని నాయనా..భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల అభిమానాన్నిసంపాదించుకుంది. ఆ వెంటనే వరుస వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోరి కష్టాలు తెచ్చుకుని చిక్కుల్లో పడిపోయింది.

కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి హిట్స్ అందుకున్న ఈ భామ రాను రాను అవకాశాలు కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె ఈ ఏడాదిలో చేసిన సినిమాలన్నీ బాక్సఫీస్ వద్ద బొక్క బోర్లా పడడంతో ఆమె క్రేజ్ అమాంతం పడిపోయింది. తాజాగా ఆమె నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా హిట్ అయినప్పటికీ.. ఆమె పాత్రకి ఏమాత్రం గుర్తింపు రాలేదు.ఆమె భవిష్యత్తు అంధకారాల్లో పడిన సమయంలో ఆమెకి ఊహించని గట్టిగా తగిలింది. తమిళ నిర్మాతల మండలి ఆమెకి ఏకంగా రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అసలే కెరీర్ మీద నీలి నీడలు అలుముకున్న సమయంలో పిడుగులాంటి కబురు తెలియడంతో ఈ భామ అల్లాడిపోతోంది. ఇంతకీ విష్యం ఏంటంటే..?

తెలుగులో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన ‘100%’ లవ్ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్యని ఎంపిక చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పేసింది. అయితే ఇంతలో ఏమైందో తెలీదు కానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే నిర్మాతలు ఊరుకుంటారా ఏంటి.? వెంటనే ఆమె మీద తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.

సినిమా చేసేందుకు ముందుగా ఒప్పుకుని ఆ తర్వాత షూటింగుకి హాజరు కాకపోవడంతో లావణ్యపై చర్యలు తీసుకోవాలంటూ చిత్రబృందం వాదించింది. దీంతో ఈ వ్యవహారాన్ని పరిశీలించిన నిర్మాతల మండలి.. లావణ్యదే తప్పు అని తేల్చడమే కాకుండా మూడు కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించారు. దీంతో లావణ్య లబోదిబో అని గగ్గోలు పెడుతోంది.

Leave a comment