Gossipsఅర్ధాంతరంగా ఆగిపోయిన ఆర్.ఆర్.ఆర్..!

అర్ధాంతరంగా ఆగిపోయిన ఆర్.ఆర్.ఆర్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ మీద ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమా అర్ధాంతరంగా ఆపేస్తున్నట్టు ఆ వార్తల్లోని సారాంశం. అదేంటి అలా ఎలా ఆగుతుంది అంటే ప్రస్తుతం రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి బిజీలో ఉన్నాడు. జనవరి 2న కార్తికేయ మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా సెకండ్ షెడ్యూల్ కు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందట.
3
రాం చరణ్ ఓ పక్క బోయపాటి శ్రీను డైరక్షన్ లో వినయ విధేయ రామ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేసేదాకా ఆర్.ఆర్.ఆర్ కు కష్టమే అని చెప్ప్పాడట. వి.వి.ఆర్ మూవీ ఓ సాంగ్ తో పాటుగా డబ్బింగ్ చెప్పాల్సి ఉందట. సో ట్రిపుల్ ఆర్ లేటుకి రాం చరణ్ కూడా ఓ కారణం అవుతున్నాడు. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ లుక్ కోసం మళ్లీ స్పెషల్ వర్క్ అవుట్స్ చేస్తున్నాడట. అది కూడా టైం పడుతుందట. అలా మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సెకండ్ షెడ్యూల్ జనవరి లాస్ట్ లో కాని.. ఫిబ్రవరి మొదట్లో కాని మొదలవుతుందట.
2
రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద నేషనల్ మీడియా కన్ను కూడా ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను హిందిలో కరణ్ జోహార్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news