” లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ” సెకండ్ ట్రైలర్.. వర్మ మొత్తం బయటపెట్టాడు..!

39

ఎన్.టి.ఆర్ అసలు కథ తాను చెబుతా అంటూ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మొదలుపెట్టిన సంచలన దర్శకుడు వర్మ చెప్పినట్టుగానే ఎన్.టి.ఆర్ జీవిత చరమాకంలో జరిగిన సంఘటనల సమాహారంతో ఈ సినిమా చేస్తున్నాడు. టీజరే సెన్సేషన్ క్రియేట్ చేయగా ఆ తర్వాత వచ్చిన మొదటి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి మరో ట్రైలర్ వదిలాడు వర్మ. ఇందులో కూడా వర్మ తాను ఏం చెప్పదలచుకున్నాడో అనేది పర్ఫెక్ట్ చెబుతూ వచ్చింది ఈ ట్రైలర్.

లక్ష్మీ పార్వతికి ఎన్.టి.ఆర్ దగ్గరవడం.. పార్టీ శ్రేణులు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం.. చంద్రబాబు ఇంకా ఎన్.టి.ఆర్ వారసులు ఏం చేసారన్నది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా కథ. సినిమా ట్రైలర్ ఎమోషనల్ గా కట్ చేశారు. తప్పకుండా సినిమాకు ఈ ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. తాను చెప్పదలచుకునే విషయాన్ని చెప్పడంలో ఎలాంటి మొహమాటం పడని ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో మరోసారి సెన్సేషన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

ఈ సినిమాను ఆర్జివితో పాటుగా అగస్త్య మను డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది. సినిమాను ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి. సినిమా ప్రమోషన్స్ మాత్రం ఓ రేంజ్ లో చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కు సంబందించిన ఏ చిన్న విషయమైన సోసల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Leave a comment