లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా వెనుక రహస్యం..

85

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రాజకీయ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటి వరకు ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా లో సీఎం చంద్రబాబు నాయుడిని నెగిటీవ్ గా చూపిస్తున్నారని టీడీపీ శ్రేణులు మూవీ రిలీజ్ ని ఆపడానికి ప్రయత్నించాయి. కానీ ఎలక్షన్ కమీషన్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 22 న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ ఇంతలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల మరోమారు వాయిదా పడింది. ఎన్నికల ముందు సినిమా విడుదలను ఒప్పుకునేది లేదని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ కోర్టు కెళ్తానని ప్రకటించాడు.
1
వెంటనే సెన్సార్ బోర్డుతో నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని వర్మ ప్రకటించాడు. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు.ఈ నెల 22న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చిన వర్మ 29న విడుదల చేయాలని నిర్ణయించాడు. అనంతరం అభ్యంతరకరంగా ఉన్న సీన్లు, సంభాషణలు తొలగించి రీ స్క్రీన్ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెల 29 న రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడు వర్మ

Leave a comment