Gossipsఫిలిమ్ నగర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిషేదించారా..?

ఫిలిమ్ నగర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిషేదించారా..?

ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ కి క్రిష్ దర్శకత్వం వహించగా, బాలకృష్ణ కథానాయకుడిగా నటించారు. అయితే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలు ఆశించిన స్థాయి అందుకోలేక పోయాయి. ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై మొదటి నుంచి తనదైన ప్రమోషన్ చేసుకుంటూ వచ్చారు.

అందరూ ఊహించినట్టే ఈ సినిమా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి..కానీ వర్మ ఎక్కడా తగ్గలేదు..అనుకున్న సమయానికే గత నెల 29న రిలీజ్ చేశారు. కాకపోతే ఈ సినిమా ఏపిలో రిలీజ్ కాలేదు. నేడు ఈ సినిమాపై కోర్టు తీర్పు రానుంది. కొత్తగా విడుదలైన సినిమాను ప్రతి శనివారం ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. అది ఆనవాయితీగా వస్తున్నది.

అందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఇటీవల విడుదలైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను ప్రదర్శించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మాత్రం ఓ వర్గం వారు అడ్డుకున్నారు. తెలుగురాష్ర్టాల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాను తమ కోసం ప్రదర్శించాలని ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులు కోరుతున్నారు.

ఈ విషయం తెలుసుకొని వెంటనే ఒక వర్గం వారు వచ్చి ఎట్టి పరిస్థితిలో ఆ సినిమాను ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శించవద్దంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో క్లబ్ అధ్యక్షుడు సినిమా ప్రదర్శనకు అంగీకారం తెలుపలేదు. కాగా, కొంత మంది రాజకీయ ఒత్తిడితో ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శనను అడ్డుకోవడం తగదని, అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పలువురు ఫిలింనగర్ క్లబ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news