బాలయ్యకు వర్మ టార్గెట్ మామూలుగా లేదుగా..!

136

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ గత నెల 29 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను టీడీపీ శ్రేణులు ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు..కానీ అన్ని అవరోదాలు దాటుకొని ఈ సినిమా యూ సర్టిఫికెట్ తీసుకొని మరీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు ఎవరూ లేరు..కొంత మంది అయితే అసలు ముఖ పరిచయమే లేదు. కానీ కథలో ఉన్న కాంట్రోవర్షియల్ పాయింట్ తో హైప్ వచ్చేలా చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దీని ఫలితం చూసి సంతోషంగానే ఉన్నాడు.

ఒకప్పుడు శివ సినిమాతో తానేంటో నిరూపించుకున్న వర్మ మరోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ తో తన ఉనికి చాటుకున్నాడు. ఆఫీసర్ లాంటి తీసికట్టు డిజాస్టర్ తర్వాత ఎలాంటి స్టార్లు లేకుండా వర్మ సినిమా మొదటి రోజు కోటి రూపాయలు దాటేసిందంటే చిన్న విషయం కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓవర్సీస్ లో నమోదు చేసిన రికార్డు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. న్టీఆర్ మీదే వచ్చిన మహానాయకుడు రెండు రోజులకు గాను $216458 వసూలు చేయగా లక్ష్మీస్ ఎన్టీఆర్ దానికి ఓ వెయ్యి డాలర్లు అదనంగా $218700 రాబట్టడం గమనార్హం.

నందమూరి హీరో బాలకృష్ణ వంద సినిమాలు పూర్తి చేసుకొని తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన హీరో. క్రిష్ లాంటి బ్రాండ్ ఉన్న దర్శకుడు కీరవాణి లాంటి దిగ్గజ సంగీతం రైటర్ గా, సాయి మాధవ్ బుర్ర కలం ఇవేవి మహానాయుకుడు సినిమాను కాపాడలేక పోయాయి. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కేవలం కథబలంతోనే ఆడియన్స్ ని థియేటర్లోకి రప్పిస్తుంది. మహానాయకుడిని క్రాస్ చేయడం అంటే వర్మ ఫ్యాన్స్ కు అంత కన్నా కావాల్సింది ఏముంది. వర్మ ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుందనేదానికి ఇదే కారణం.

Leave a comment