మెగా ఫ్యామిలీకి దెబ్బేస్తున్న” లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ” ..!

114

అనుకున్నట్టుగానే మార్చి 29న ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కన్ఫాం అవడంతో మెగా ఫ్యామిలీలో టెన్షన్ మొదలైంది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా తీస్తే నందమూరి ఫ్యామిలీ కదా టెన్షన్ పడాల్సింది మరి మెగా ఫ్యామిలీ ఎందుకు భయపడుతుంది అంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నటించిన సూర్యకాంతం సినిమా కూడా ఆరోజు రిలీజ్ అవుతుంది.

మార్చి 29 శుక్రవారం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అవుతుందని తెలుసు.. కాని అదే రోజు రిలీజ్ అవుతున్న సూర్యకాంతం ను అసలు పట్టించుకుంటారా లేదా అన్న డౌట్ వస్తుంది. మెగా డాటర్ నిహారిక ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. కాని లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రమోషన్స్ చూస్తుంటే నిహారికకు ఈసారి కూడా హిట్టు దక్కనిచ్చేట్టు లేరని అనిపిస్తుంది. ఓ విధంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ మెగా ఫ్యామిలీకి దెబ్బేసేలా ఉంది.

ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ సినిమా ఆడలేదు అంటే అది కచ్చితంగా మెగా కాంపౌండ్ కు అవమానమే. అందుకే సూర్యకాంతం హిట్ కొట్టేందుకు మెగా ఫ్యాన్స్ బాధ్యత మీద వేసుకున్నారు. కమర్షియల్ సినిమాలు చేసే అవకాశం ఉన్నా తన మనసుకి నచ్చిన సినిమాలు చేస్తూ వస్తున్న నిహారిక మరి సూర్యకాంతంతో అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Leave a comment