Moviesఆ సినిమా సెక్స్ సినిమా అనుకున్నారేమో : రాయ్ లక్ష్మి

ఆ సినిమా సెక్స్ సినిమా అనుకున్నారేమో : రాయ్ లక్ష్మి

జూలీ- 2  సినిమా ద్వారా బాలీవుడ్లో సెటిల్ అవుదామని భావించిన ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మీకి నిరాశే ఎదురయ్యింది. పాపం జూలీ- 2  ఆమె కెరీర్ లోనే  ఇది 50వ సినిమా కావడం.. అదే చిత్రం ఈ భామకు బాలీవుడ్ లో లాంఛింగ్ మూవీ కావడంతో చాలా ఆశలే పెట్టుకుంది ఈ అమ్మడు కానీ అవేవీ నెరవేరలేదు. అటు క్రిటిక్స్ నుంచి ఇటు జనాల వరకూ అందరూ ఈమె నటించిన సినిమాని ఉతికి ఆరేశారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఆ సినిమా ప్లాప్ గురించి తీరిగ్గా కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. ఈ  చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని దర్శకుడు దీపక్ శివదాసాని ఒప్పుకోవడం ఆయన గొప్పతనం గా చెప్పుకోవచ్చు. రాయ్ లక్ష్మి అయితే కారణాలు కూడా చెప్పేస్తోంది. ‘జనాలు ఈ చిత్రాన్ని సెక్స్ సినిమా అనుకున్నారని రాయ్ చెప్తోంది.
 కానీ జూలీ2 మూవీలో అలాంటి కంటెంట్ ఏమీ ఉండదు. అసలు ఈ మూవీకి ప్రమోషన్ కూడా అలాగే చేశారు. మొదటగా రిలీజ్ చేసిన టీజర్ కూడా అదే తరహా ఇండికేషన్స్ ఇచ్చింది కదా’ అని చెప్పిన రాయ్ లక్ష్మి చెప్పుకొస్తోంది. ఈ చిత్రం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని దిగులు చెందుతోంది. ఇది నా జీవితంలో ఒక గుణపాఠంగా  భావిస్తున్నాని రాయ్ చెప్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news