Gossipsఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ర‌త్తాలు రోలేంటో..!

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ర‌త్తాలు రోలేంటో..!

కాంచ‌న‌, చంద్ర‌క‌ళ, శివ‌గంగ‌ సినిమాల‌తో హార‌ర్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైంద‌నుకున్న రాయ్ ల‌క్ష్మీ ఆలియాస్ ల‌క్ష్మీ రాయ్‌కి మ‌న ద‌క్షిణాది సినిమాల్లో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అడ‌పా ద‌డ‌పా కొన్ని సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో త‌ళుక్కున మెరుస్తోందంతే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో జూలీ-2 ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇప్పుడీ బ్యూటీ తెలుగులో ఓ బయోపిక్ లో నటించనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలో కీలకమైన లక్ష్మీపార్వతి పాత్రలో లక్ష్మీరాయ్ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం ఇప్పటికే రాయ్ లక్ష్మితో పాటు వాణి విశ్వనాథ్ ను కూడా సంప్రదించామని.. వీళ్లలో ఎవరు లీడ్ రోల్ చేస్తారో త్వరలోనే ప్రకటిస్తామని ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వయంగా ప్రకటించారు. మ‌రి ఈ ర‌త్తాలు ల‌క్ష్మీపార్వ‌తి రోల్‌లో ఎలా ర‌క్తిక‌ట్టిస్తుందో ? చూడాలి. ఈ సినిమా ఈ రోజు నుంచే సెట్స్ పైకి రానుంది. జయం మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఆదర్శ గృహిణి అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టి సినిమా అంచనాలను పెంచేశారు.

రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పిన వెంటనే ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ అనే పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఇక ఈ రెండిటితో పాటు ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య ఎన్టీఆర్ రోల్‌లో తేజ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news