ఆ నటుడిని తనతో పడుకోమన్న లేడీ నిర్మాత : సంచలన విషయాలు బయటపెట్టిన నటుడు

jabardasth-phani

సినిమా రంగమంటేనే ఒక రంగుల ప్రపంచం ఎందరికో ఒక పెద్ద కలల ప్రపంచం. అటువంటి ప్రపంచంలోకి అడుగుపెట్టి అవకాశాలు అందిపుచ్చుకోవటం కొత్తవారికి వారి టాలెంట్ తో పాటు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. హీరోయిన్ల అవకాశాల కోసం వచ్చేవారికి సినిమా రంగంలోని ఎందరో వ్యక్తుల నుండి లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి అని పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం బయటపెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్లుగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకే కాక నటులుగా అవకాశం కోసం వచ్చే అబ్బాయిలకి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయంట.

అసలు విషయానికొస్తే ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో వెలుగులోకి వచ్చిన ఫణి అనే నటుడు ఈ మధ్య సామజిక మాధ్యమంలో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇఛ్చి ఎన్నో సంచలన విషయాలని బయటపెట్టాడు. ఫణి సినిమాలలో కూడా నటించాడు.అయితే ఒకసారి ఒక సినిమా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఆ సినిమా కి నిర్మాత , దర్శకులు ఇద్దరూ ఆడవారేనంట. వారు ఆడిషన్ పూర్తి అయ్యాక “అంతా ఓకే కదా నీకు” అని అడిగారంట .అప్పుడు ఫణి “హా.. ఓకే మేడమ్” అని బదులిచ్చాడంట. వారు “కమిట్మెంట్ కూడా ఓకే కదా అని అడిగారంట ” అప్పుడు ఫణి కి దిమ్మదిరిగి పోయిందంట . అప్పటివరకు అమ్మాయిలని మాత్రమే కమిట్మెంట్ అడిగినట్లు విన్న తను తనని కూడా ఒక లేడీ అలా అడిగేసరికి ఆ సినిమా అవకాశాన్ని తాను వదిలేసుకున్నాడంట. అదండీ అసలు సంగతి !

phani

Leave a comment