టీజర్‌ రివ్యూ : నందు, శ్రీముఖి రచ్చరచ్చ

Sreemukhi

బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. పలు రియాల్టీ షోలకు, గేమ్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన శ్రీముఖి ఇప్పటి వరకు పలు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన విషయం తెలిసిందే. కాని బుల్లి తెరపై దక్కిన సక్సెస్‌ వెండి తెర ద్వారా ఈమెకు దక్కలేదని చెప్పుకోవాలి. అయినా కూడా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకోవాలనే తాపత్రయంతో శ్రీముఖి అందివచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా నందుతో కలిసి శ్రీముఖి కుటుంబ కథా చిత్రమ్‌ లో నటించింది.

టైటిల్‌ చూసిన ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఇదో ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుందని, ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూసే విధంగా ఉంటుందని భావించారు. కాని తీరా టీజర్‌ విడుదల తర్వాత ఇదో పక్కా హర్రర్‌ సినిమా అంటూ తేలిపోయింది. నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజులు ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం క్రైమ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా సాగుతుందని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

ఈ చిత్రంలో నందు మరియు శ్రీముఖిల మద్య రొమాన్స్‌ రచ్చ రచ్చ ఉంటుందని, ఇద్దరు కూడా రెచ్చి పోయి నటించారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మరి ఈ చిత్రంతో అయినా ముద్దుగుమ్మ శ్రీముఖికి మరియు నందుకు గుర్తింపు వస్తుందా అనేది చూడాలి.

 

Leave a comment