Gossipsఅర్జున్ రెడ్డితో ఆ డైరెక్టర్ కి పనేంటి ??

అర్జున్ రెడ్డితో ఆ డైరెక్టర్ కి పనేంటి ??

“మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు”తో మంచి బ్రేక్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్‌.. అంత‌కుమునుపు తీసిన డెబ్యూ మూవీ ఓన‌మాలుతో తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా అర్జున్ రెడ్డి ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేతులు క‌లిపాడు.రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రారంభం కానుంది.సీనియర్ ప్రొడ్యూసర్ , క్రియెటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్ రామారావు ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

 

కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు.పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మి స్తోన్న ఒక సినిమాలో డిఫరెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాడు.అలాగే రాహుల్ అనే మరో యువ దర్శకుడి తెరకెక్కిస్తోన్న ప్రయోగాత్మకమైన సినిమాకి కూడా ఓకే చెప్పి దీని మేకింగ్ ని కూడా షురూచేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news