కృష్ణార్జున యుద్ధం హిట్టా ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

krishnarjuna-yuddam-hit-or-flop

నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. నాని డ్యుయల్ రోల్ లో మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇక అనుపమ, రుక్సార్ లాంటి హీరోయిన్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు.

ఓవరాల్ గా కృష్ణార్జున యుద్ధం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాని వరుస విజయాల ఫాంను ఈ సినిమా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే సినిమాలో నాని తప్ప మిగతా పాత్రలన్ని అంత గొప్పగా ఏమి లేవని అంటున్నారు. ముఖ్యంగా మేర్లపాక గాంధి స్క్రీన్ ప్లే సినిమాను సక్సెస్ ఫుల్ గా నడిపించలేదు అన్న టాక్ వస్తుంది.

సినిమాలో నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాని మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వచ్చింది. హిప్ హాప్ తమిజ మ్యూజిక్, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ కాగా.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే సినిమా యావరేజ్ గా నిలిచేలా చేస్తాయని చెబుతున్నారు.

Leave a comment