Movies“కృష్ణార్జున యుద్ధం” 2nd డే కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద బోల్తా

“కృష్ణార్జున యుద్ధం” 2nd డే కలెక్షన్స్… బాక్సాఫీస్ వద్ద బోల్తా

“నాని” తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తనదైన నటనతో హావభావాలతో ప్రేక్షకుల చేత న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు ఈ యువ హీరో. గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాని. 2015 లో విడుదలైన భలే భలే మగాడివోయ్ నుండి వరుసగా 8 ఘన విజయాలు అందుకున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన MCA నాని సినీ కెరీర్ లోనే మొదటిసారి 40 కోట్ల షేర్ వసూలు చేసింది.ఇక ఇప్పుడు రీసెంట్ గ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం.దీంతో సినిమా పై బారి అంచనాలు నెలకొన్నాయి.

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్ల గ్రాస్ 10 కోట్లకు పైగా షేర్ ని “కృష్ణార్జున యుద్ధం” కలెక్ట్ చేసిందని ట్రేడ్ సమాచారం.కాగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు తో పోల్చుకుంటే దాదాపు 40% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పొచ్చు. కానీ సినిమాకి 3 మరియు 4 రోజులు అసలు వీకెండ్ అని చెప్పాలి. ఫ్రై డే రిలీజ్ కాకుండా గురువారం రిలీజ్ అవ్వడం వలన శుక్రవారం వర్కింగ్ డే తో సినిమా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news