Gossipsబాలయ్య గుర్రపుస్వారీ పై క్రిష్ సంచలన కామెంట్స్...

బాలయ్య గుర్రపుస్వారీ పై క్రిష్ సంచలన కామెంట్స్…

సినిమా షూటింగ్ ల లో కొన్ని సార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న చేదు అనుభవాలు బాగానే ఎదురవుతుంటాయి. ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా యాక్షన్ సీన్స్ కి సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు సంభవిస్తూ ఉంటాయి, ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు గాయపడుతుంటారు. హీరోలు కూడా ఒక్కోసారి పొరపాట్ల వలన గాయాలపాలవుతారు. అందుకే చిత్ర యూనిట్ ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

అయితే సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ కి కూడా ఇటువంటి ఒక చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని దర్శకుడు క్రిష్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో ఒక యాక్షన్ సిన్ ను చిత్రీకరించేటపుడు బాలయ్య గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయారట. ఆ ఒక్క సన్నివేశం కోసం ప్రత్యకంగా హాలీవుడ్ సినిమాల్లో వాడే అరేబియన్ గుర్రాలని ఆ సినిమా కోసం వాడారట. అయితే బాలయ్య ఒక్క రోజులోనే ఆ గుర్రాన్ని బాగా మచ్చిక చేసుకొని షూటింగ్ లో పాల్గొన్నాడు. బాలకృష్ణ కు చిన్నతనం నుండి హార్స్ రైడింగ్ బాగా తెలుసని క్రిష్ ఈ సందర్భంగా తెలియచేసారు.

అయితే ఆ సన్నివేశం లో బాలకృష్ణ ఒక బాబును గుర్రం పై ఎక్కించుకొని తీసుకువెళ్ళాలి ఆ సన్నివేశం లో గుర్రానికి ఇరువైపులా రెండు బాంబులను పేలేలా ప్లాన్ చేశాం. కానీ చిత్ర యూనిట్ లోపం వలన కేవలం కుడివైపున ఉన్న బాంబు మాత్రమే పేలింది. దీంతో గుర్రం ఒక్కసారిగా ఎడమవైపు పరిగెత్తడంతో బాలకృష్ణ బాబుతో సహా కిందపడిపోయారు. అయితే బాలకృష్ణ బాబును జాగ్రతగా పట్టుకోవడం వలన ఇద్దరికి పెద్దగా గాయాలు కాలేదని చిత్ర దర్శకుడు క్రిష్ తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news