Gossipsప్రైజ్ మనీ 5 సెకండ్స్ లో 50 లక్షలు ఖర్చుపెట్టిన కౌశల్..!

ప్రైజ్ మనీ 5 సెకండ్స్ లో 50 లక్షలు ఖర్చుపెట్టిన కౌశల్..!

బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ తన సంచలన ప్రకటనతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న కౌశల్ 113 రోజుల తన స్పోర్టింగ్ స్పిరిట్ ప్రేక్షకులందరికి నచ్చింది. ఇక బయట కౌశల్ ఆర్మీ ఒకటి ఏర్పడి కౌశల్ కు సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
2
ప్రైజ్ మనీ గెలవడానికి ఇంత చేసిన కౌశల్ ఆ ప్రైజ్ మనీ తన తల్లి జ్ఞాపకంగా క్యాన్సర్ తో బాధపడే వారికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. తన తల్లి లా మరెవరు మరణించ కూడదని క్యాన్సర్ తో బాధపడే పేదవారికి తాను ఈ డబ్బుల్లో కొంత మొత్తాన్ని అందిస్తానని అన్నారు కౌశల్.
1
ఇన్నాళ్లు హౌజ్ లో స్వార్ధపరుడిగా పేరు తెచ్చుకున్న కౌశల్ ఇలా ప్రైజ్ మనీ క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు ఇస్తా అనడం చూసి అందరు అవాక్కవుతున్నారు. నిజంగానే ఇది గొప్ప పని అని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news