Moviesచిరు సినిమాకు కొరటాలకు అన్ని కోట్లా..?

చిరు సినిమాకు కొరటాలకు అన్ని కోట్లా..?

ఖైది నంబర్ 150 తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు నిర్మాత రాం చరణ్. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ, చిరు సినిమా కన్ఫాం అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా సైరా లేట్ అవడం వల్ల కుదరలేదు.

ఇక చిరు, కొరటాల శివ సినిమా కూడా ఓ సోషల్ మెసేజ్ తో వస్తుందట. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. సినిమాకు రెమ్యునరేషన్ గా కొరటాల శివకు భారీ మొత్తమే అందనున్నట్టు తెలుస్తుంది. 15 కోట్ల రెమ్యునరేషన్ కింద సినిమా ఓకే చేయగా అడ్వాన్స్ గా 2 కోట్లు తీసుకున్నాడట కొరటాల శివ. అయితే ఆ మిగిలిన మొత్తం కూడా ఉత్తరాంధ్ర హక్కుల రూపంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అలా చేస్తే కొరటాల శివకు మరో రెండు కోట్లు అదనంగా వచ్చినట్టే.

ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయ్యి వసూళ్లు బాగుంటే ఎంత లాభం వస్తే అంత అన్నట్టు. మొత్తానికి కొరటాల శివ ప్లాన్ బాగానే ఉందని చెప్పొచ్చు. ఎలాగు డైరక్టర్ ఖర్చు ఉండదు కాబట్టి ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టొచ్చు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news