జవాన్ లో కొరటాల శివ హస్తం…

koratala shiva

రచయిత దర్శకుడిగా కొరటాల శివ టాలెంట్ ఏంటో అందరికి తెలిసిందే. మిర్చితో దర్శకుడిగా మొదలైన కొరటాల శివ ప్రయాణం లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ తో కూడా హిట్ మేనియా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్న కొరటాల శివ తనలానే రచయితగా చేసి దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని కలలు కంటున్న బివిఎస్ రవికి సాయం చేశాడట.

బివిఎస్ రవి డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా వస్తున్న సినిమా జవాన్. ఆ సినిమా విషయంలో రీ షూట్స్ జరుగుతుండగా సినిమా మొత్తం చూసిన కొరటాల శివ తనకు తోచిన సలహాలు చెప్పాడట. కొరటాల శివ సలహాలు పాటించాకే సినిమాకు ఓ రూపం వచ్చిందని అంటున్నారు. రచయితగా ఉన్న బివిఎస్ రవి దర్శకుడిగా చేసిన మొదటి సినిమా వాంటెడ్ ఫ్లాప్ అయ్యింది.

మరి కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తీసిన ఈ జవాన్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉందట. ఈ విషయాన్ని దిల్ రాజు ఓపెన్ గా చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. మరి జవాన్ తో హిట్ కొడతాం అంటూ ధైర్యంగా చెబుతున్న తేజ్ నిజంగా హిట్ కొట్టెస్తాడో లేదో తెలియాలంటే డిసెంబర్ 1 దాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a comment