చివరకి నిహారిక పరిస్థితి కూడా కష్టం.?

130

కొణిదెల ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ముచ్చటగా మూడవ సినిమా కూడా ఫెయిల్యూర్ రిజల్ట్ అందుకుంది. మెగా డాటర్ గా ఒకమనసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ సినిమాతో హిట్ అందుకోలేదు. సెకండ్ ప్రయత్నంగా చేసిన్ హ్యాపీ వెడ్డింగ్ కూడా నిరాశపరచింది. థర్డ్ మూవీగా వచ్చిన సూర్యకాంతం మీద చాలా హోప్స్ పెట్టుకుంది నిహారిక. కాని ఆ సినిమా కూడా నిన్న రిలీజై ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది.

ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో ప్రతిభ చాటుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి మొదటి సినిమాగా సూర్యకాంతం చేశాడు. కాని ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు నిహారిక ఖాతాలో మరో ఫెయిల్యూర్ వచ్చి చేరింది. ఈ సినిమాలో నిహారిక అల్లరి పిల్లగా బాగా నటించినా కథ కథనాలు రొటీన్ గా ఉండటం వల్ల ప్రేక్షకులు పెదవి విరిస్తున్నారు.

ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో సైలెంట్ గా నటించిన నిహారిక సూర్యకాంతంలో మాత్రం తన టాలెంట్ చూపించేసింది. ఇక మెగా ఫ్యాన్స్ నిహారిక ఈ సినిమాల్లో నటించడం మానేస్తే బెటర్ అని అంటున్నారు. నిహారిక సూర్యాకంతం ఫెయిల్యూర్ ఆమెకు షాక్ ఇచ్చింది.

Leave a comment