Gossips' కొబ్బ‌రిమ‌ట్ట ' 3 డేస్ కలెక్షన్స్... సంపూ చిత‌క్కొట్టేస్తున్నాడు..

‘ కొబ్బ‌రిమ‌ట్ట ‘ 3 డేస్ కలెక్షన్స్… సంపూ చిత‌క్కొట్టేస్తున్నాడు..

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. గ‌త శ‌నివారం రిలీజ్ అయిన కొబ్బ‌రిమ‌ట్ట నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరో న‌టించిన మ‌న్మ‌థుడు 2కు దిమ్మ‌తిరిగి పోయే షాక్ ఇస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. నాగార్జున మ‌న్మ‌థుడు 2, అన‌సూయ క‌థ‌నం, విశాల్ టెంప‌ర్ రీమేక్ అయోగ్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డితే కొబ్బ‌రిమ‌ట్ట మాత్రం కుమ్మేస్తోంది.

ఇక సినిమాలోనే స్ప‌ఫ్ డైలాగుల‌తో ప్ర‌స్తుత రాజ‌కీయ‌, సినిమా ప‌రిస్థితుల‌పై సెటైర్లు వేసిన కొబ్బ‌రిమ‌ట్ట టీం ప్ర‌మోష‌న్ల‌లోనూ పెద్ద హీరోల‌కు చెంప‌పెట్టులా న‌రికిపారేస్తున్నారు. కొబ్బ‌రిమ‌ట్ట‌ సినిమా మూడు రోజుల్లో 12 కోట్ల గ్రాస్‌ సాదించినట్టుగా పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్‌లో తమ మార్క్‌ చూపించారు. ఇక సినిమా రిలీజ్ అయిన 50 గంట‌ల‌కు విజ‌య‌వంత‌మైన 50 గంట‌లు అని పోస్ట‌ర్ వ‌దిలిన టీం ఇప్పుడు 3 రోజుల‌కు రూ.12 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు అని పెట్టి… ఆ పోస్టర్‌లో స్టార్‌ మార్క్‌ పెట్టి ఫ్యాన్స్‌ కోసం రూ. 9 కోట్ల ఫేక్‌ కలెక్షన్లు యాడ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు.

స్టార్ హీరోల సినిమాల‌కు అన్ని కోట్లు… ఇన్ని కోట్లు అని హ‌డావిడి చేస్తుంటారు. అందులో చాలా ఫేక్ లెక్క‌లు ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. నాలుగు సినిమాల మ‌ధ్య‌లో పోటీకి దిగి కూడా సంపూ కొబ్బ‌రిమ‌ట్ట‌తో రూ.3 కోట్లు కొట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. హృదయకాలేయం సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమాకు రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకుడు. సంపూర్ణేష్‌ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా వీక్‌డేస్‌లోనూ స్టడీ కలెక్షన్లు సాధిస్తుండడంతో ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం నోరెళ్ల‌బెడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news