కవ్వింతల కియరా.. కళ్లతోనే మాయ చేస్తుంది..!

44

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కియరా అద్వాని. ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీతో హిట్ అందుకున్న కియరా తెలుగులో మొదటి సినిమా హిట్ అవడంతో ఆ వెంటనే రాం చరణ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నా అమ్మడు ఖాళీ టైం లో ఫోటో షూట్స్ తో పిచ్చెక్కేలా చేస్తుంది.

ఈమధ్యనే లస్ట్ స్టోరీస్ అంటూ అమ్మడు చేసిన హంగామా మర్చిపోకముందే లేటెస్ట్ గా ఎక్సిబిట్ మేగజైన్ కోసం అమ్మడు ఇచ్చిన ఫోటో షూట్ మరింత కిక్ ఇస్తుంది. దీనికి సంబందించిన వీడియో కూడా రిలీజ్ చేశారు సదర్ మేగజైన్ వారు. కళ్లతో కవ్విస్తున్న కియరాని చూస్తూ గిలిగింతలు పెడుతుంది అమ్మడు.

తెలుగులో వరుస స్టార్ అవకాశాలను అందుకున్న కియరా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ఛాన్స్ పట్టేశిందని టాక్. మొత్తానికి సౌత్ నార్త్ తేడా లేకుండా తన ఓర చూపులతో వల్లో వేసుకుంటున్న కియరా అతి త్వరలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటుందని చెప్పడం లో సందేహం లేదు.

Leave a comment