ఎన్టీఆర్ ” ఫస్ట్ లుక్ ” పై ఖుష్బుసుందర్ లవ్లీ కామెంట్స్

kushbooo-tweet

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమాకు టైటిల్ గా అరవింద సమేత అని పెట్టారు. టైటిల్ రివీల్ చేస్తూ తారక్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంచనాలకు తగినట్టుగానే టైటిల్, ఫస్ట్ లుక్ ఉండగా ఈ టైటిల్ చూసిన కొందరు తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వీరిలో కొందరు తమ దైన శైలిలో ట్వీట్ చేసారు అందులో ఒకరు ఖుష్బుసుందర్ .

ఇంతకు ఖుష్బుసుందర్ ఏమని ట్వీట్ చేసారంటే ” O MY MY..look who is here.. and how!!! my hero..my super hero..the hottest star..the brightest star..TARAK TARAK TARAK..( చూడండి నా సూపర్ హీరో ని ఎంత అందంగా వెలిగిపోతున్నాడో ) ” విషయం ఏదైనా సరే తనకు తోచినది ట్వీట్ చేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు ఖుష్బుసుందర్. ఖుష్బుసుందర్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు సోషల్ మీడియా లో డిస్కషన్ మొదలైంది.త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Leave a comment