Movies ట్రైలర్ టాక్ : ఈ ‘ఖైదీ’ కోసం వెయిటింగ్..

ట్రైలర్ టాక్ : ఈ ‘ఖైదీ’ కోసం వెయిటింగ్..

Konidela productions banner has released the trailer of Chiranjeevi’s milestone movie Khaidi No 150.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ‘ఖైదీ నెంబర్ 150’ యూనిట్ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఏ అంచనాలైతే అందరూ పెట్టుకున్నారో.. అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫుల్ ఎనర్జీతో నిండి ఉంది. ముఖ్యంగా.. యాక్షన్ సీన్లను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్‌ని ఎడిట్ చేశారు. వందలాదిమంది వెంబడిస్తుంటే చిరు పరుగులు పెడుతూ ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమా స్టోరీలైన్ గురించి అందరికీ తెలిసిందే. కార్పొరేట్ కంపెనీవాళ్లు తమ స్వలాభం కోసం రైతుల దగ్గరనుంచి భూములు లాక్కోగా.. జైలు నుంచి పారిపోయి వచ్చే ‘ఖైదీ’ (చిరు) వారి కష్టాల్ని ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ సినిమా కథ. ఆ స్టోరీలైన్‌ని ఇందులో క్లియర్‌గా చూపించేశారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హైలైట్‌గా ఉన్నాయి. డైలాగులు కూడా అదిరాయి. మధ్యలో చూపించిన పాటల ఫ్రేముల్లో చిరు యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపించి, ఔరా అనిపించాడు. ఫైట్స్ సన్నివేశాల్లో కెవ్వుకేక అనిపించాడు. క్లోజప్ షాట్స్ చాలా బాగున్నాయి. తన మార్క్ డైలాగ్ డెలివరీతోనూ చిరు ఆకట్టుకున్నాడు. అలాగే.. అక్కడక్కడ రెండు మూడు ఫ్రేముల్లో కాజల్, లక్ష్మీరాయ్‌లు అందంగా తళుక్కుమన్నారు.

టెక్నికల్ పరంగా చూసుకుంటే.. వినాయక్ ఈసారి తన మేకింగ్ స్టైల్‌ని కాస్త మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తన రొటీన్ ఫార్ములాని కాకుండా చిరుకోసం డిఫరెంట్‌గానే దీన్ని తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ కళ్ళుచెదిరేలా ఉంది. చూపించిన ప్రతి ఫ్రేమ్ అదిరిపోయాయంతే. దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్. ఈ ట్రైలర్‌ని ఎడిట్ చేసిన విధానానికి మంచి మార్కులు వేయొచ్చు. ఓవరాల్‌గా.. ఈ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news