Moviesఓవర్సీస్‌లో పంథం నెగ్గిన చిరంజీవి.. ఆల్‌టైమ్ రికార్డ్ ధరకి ‘ఖైదీ’ రైట్స్

ఓవర్సీస్‌లో పంథం నెగ్గిన చిరంజీవి.. ఆల్‌టైమ్ రికార్డ్ ధరకి ‘ఖైదీ’ రైట్స్

Megastar Chiranjeevi’s prestigeous 150 project Khaidi No 150 overseas rights has been sold for bomb price which is said to be alltime record in tollywood.

చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో.. ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’పై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ కారణంగానే ఈ మూవీ ఓ రేంజులో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రా మొత్తంలో ఈ మూవీ రైట్స్ ‘బాహుబలి’కి మించి అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. అలాగే.. నైజాంలోనూ రూ.21 కోట్లకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు. రీసెంట్‌గానే కర్ణాటక హక్కులు రూ.8.5 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.13 కోట్లకు సోల్డ్ అయ్యాయి. ఇక తాజాగా ఓవర్సీస్ రైట్స్ ఆల్‌టైమ్ రికార్డ్ ధరకి అమ్ముడుపోయినట్లు సమాచారం.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని అక్షరాల రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ దెబ్బతో మహేష్ ‘బ్రహ్మోత్సవం’ (రూ.13 కోట్లు), ‘బాహుబలి’ (రూ.9 కోట్లు) రికార్డులు బద్దలైపోయాయి. అంటే.. తెలుగు చిత్రాల్లో ఈ మూవీ ఓవర్సీస్‌లోనూ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిందన్నమాట. వాస్తవానికి.. మొన్నటివరకు ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని రూ.13 కోట్లకు తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నించారు. కానీ.. చిత్రబృందం అంతకంటే ఎక్కువ రేటుకి అమ్మాలనే ఉద్దేశంతో వెనకడుగు వేసింది. చివరికి రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకుని.. చిత్రబృందం తన పంథా నెగ్గించుకుంది. ఈ చిత్రంపై నెలకొన్న అంచనాల్ని బట్టి చూస్తుంటే.. ఓవర్సీస్‌లో ఇది 3 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందనే నమ్మకంతోనే అంత రేటుకి రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. జనవరి 4వ తేదీన భారీఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. వివి వినాయక్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news