” కె.జి.ఎఫ్ ” రివ్యూ & రేటింగ్

10

కె.జి.ఎఫ్ రివ్యూ & రేటింగ్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో వారాహి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ మూవీ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఎనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఎలా పుట్టామన్నది కాదు ఎలా పోయాం అన్నది గొప్ప.. అంటూ తల్లి చెప్పిన మాటని మనసులో బలంగా ముద్ర వేసుకున్న పవన్ ముంబై వచ్చి రాకీగా మారి స్మల్గ్లింగ్స్ చేస్తుంటాడు. అలా పని చేస్తున్న అతనికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుండి కాల్ వస్తుంది. అక్కడ నియంతగా ఉన్న గరుడని చంపితే అతనిదే రాజ్యం అనుకుంటాడు. అయితే అవకాశం వచ్చినా గరుడని రాకీ చంపడు.. ఎందుకు..? కె.జి.ఎఫ్ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లింది..? రాకీ ఏం చేశాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

కన్నడ రాకింగ్ స్టార్ అయిన యశ్ తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో అతని హీరోయిజం ఇక్కడ వాళ్లకు నచ్చుకున్నా కన్నడ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది. ఇక హీరోయిన్ శ్రీనాథ్ శెట్టి పర్వాలేదు. విలన్ గా చేసిన రామచంద్ర రాజు బాగా చేశాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

రవి బస్నూర్, తనిష్క్ ల మ్యూజిక్ అలరించింది.. ముఖ్యంగా నేపథ్య సంగీతం అలరించింది. భువన గౌడ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పొచ్చు. కలర్ స్కీం బాగా కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రశాంత్ నీల్ డైరక్షన్ ఓకే.. కథ, కథనాల్లో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

విశ్లేషణ :

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చిన ఈ కె.జి.ఎఫ్ మూవీ టీజర్, ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెంచారు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఎంచుకున్న కథ బాగున్నా ఆ కథ తాలూఖా ఇంటెన్స్ మెయిన్ టైన్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

ముఖ్యంగా కథనం కొన్ని చోట్ల ట్రాక్ తప్పేస్తుంది. ఫ్లాష్ ఎపిసోడ్స్ అటు ఇటుగా అనిపిస్తాయి. ఇక యశ్ హీరోయిజం ఇక్కడ ప్రేక్షకులకు కాస్త అతిగానే అనిపిస్తుంది. మాస్ ఆడియెన్స్ కు ఈ మూవీ నచ్చే అవకాశం ఉంటుంది. లీడ్ పెయిర్ ప్రేమ, రొమాన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

యశ్ తన మార్క్ చూపించాలని ప్రయత్నించాడు. అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్ కాన్సెప్ట్ తప్ప మిగతా సినిమా అంతా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెలుగు సినిమాల్లా అనిపిస్తుంది. అందుకే తెలుగు ఆడియెన్స్ కు ఇది రొటీన్ గా అనిపించొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

యశ్ నటన

సినిమాటోగ్రఫీ

బిజిఎం

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

ఔట్ డేటెడ్ స్టోరీ

ఎడిటింగ్

బాటం లైన్ :

కె.జి.ఎఫ్.. ఆకట్టుకోలేని ప్రయత్నం..!

రేటింగ్ : 2/5

Leave a comment