” కె.జి.ఎఫ్ ” ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తమిళ హీరోలకు చుక్కలు చూపిస్తున్న యశ్..

34

తెలుగులో ఎంతమంది స్టార్స్ ఉన్నా తమిళ హీరోలకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. రజిని, కమల్ లాంటి హీరోల సినిమాలు తమిళంలో కన్నా ఇక్కడే భారీగా రిలీజ్ అవుతాయి. ఇక ఆ తర్వాత సూర్య, విక్రం లను అల్వాటు చేసుకున్నారు. కార్తి, విశాల్ సినిమాలు కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే తమిళ హీరోలు ఈమధ్య కాస్త వెనుకడుగు వేశారని చెప్పాల్సిందే. వరుసగా తమిళ డబ్బింగ్ సినిమాలేవి తెలుగు బాక్సాఫీస్ మీద పెద్దగా ప్రభావితం చూపించడం లేదు.

అయితే మొట్టమొదటిసారి ఓ కన్నడ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. కన్నడలో తెరకెక్కిన కె.జి.ఎఫ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ట్రైలరే అంచనాలను ఏర్పరచింది. ఇదిలాఉంటే ఈ సినిమా తెలుగులో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. వీక్ డేస్ లో తెలుగులో కె.జి.ఎఫ్ 5.09 కోట్లు వసూళు చేసింది. చూస్తుంటే సంక్రాంతి వచ్చే వరకు కె.జి.ఎఫ్ ఇంకా భారీ వసూళ్లను సాధించేలా ఉంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యశ్ యాక్షన్ హీరోగా అలరించారు.

ఇక ఏరియాల వారిగా కె.జి.ఎఫ్ కలక్షన్స్ చూస్తే..

నైజాం : 1.96 కోట్లు

సీడెడ్ : 1.10 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.60 కోట్లు

కృష్ణ : 0.45 కోట్లు

గుంటూరు : 0.40 కోట్లు

నెల్లూరు : 0.09 కోట్లు

ఈస్ట్ : 0.27 కోట్లు

వెస్ట్ : 0.22 కోట్లు

ఏపి/ తెలంగాణ : 5.09 కోట్లు

Leave a comment