ప్రేమ పెళ్లి పై కీర్తీ సురేష్ ఆసక్తి !

keerthi suresh

కీర్తి సురేశ్‌ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ హోమ్లీగా ఉండడంతో అందరి మనాలీసుల్లోనూ స్థానం సంపాదించుకుంది. అందుకే ఈమెకు నటన ప్రాధ్యాన్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని మరీ … వరుస అవకాశాలతో దూసుకెళ్తొంది. అందుకే కీర్తీ సురేష్ కి తెలుగుతో పాటు అన్ని భాషా చిత్రాల్లోనూ అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి.

ఈ మలయాళీ ముద్దుగుమ్మ .. ‘నేను శైలజా’, ‘నేను లోకల్‌’ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. ఆ తరువాత ఆమె పవన్‌కల్యాణ్‌ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.. తాజాగా ఈమె నటించేని ‘అజ్ఞాతవాసి’ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాదు అలనాటి టాప్ హీరోయిన్ సావిత్రి పాత్రలో కూడా ఈమె కనిపించబోతోంది.

ఈ ముద్దుగుమ్మతో ప్రేమ, పెళ్లి గురించి ప్రస్తావిస్తే ఏమంటోందో తెలుసా.. ”ప్రేమ, పెళ్లి.. ఈ రెండింటినీ నమ్ముతాను, గౌరవిస్తాను. అంతెందుకు నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానేమో అంటూ తన మనసులో ఉన్న ఆలోచన బయటపెట్టేసింది. దానికి లాజిక్ కూడా చెప్తోంది. అదేంటంటే… అమ్మనాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మా అక్క కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. నేను కూడా వాళ్లలాగే పెళ్లి చేసుకుంటాను అని వాళ్లంతా అనుకుంటున్నారు అని చెప్తోంది. కానీ నేను ఇప్పటికీ ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ప్రస్తుతం సినిమాల గురించి తప్ప నేను ఇంకేమీ ఆలోచించడం లేదని చెప్తోంది ఈ మలయాళీ బ్యూటీ.

Leave a comment