కేసీఆర్ ఇంట్లో విషాదం.. సోదరి కన్నుమూత..!

19

తెలంగాణా సిఎం కే.సి.ఆర్ సోదరి లీలమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న లీలమ్మ ప్రస్తుతం యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న లీలమ్మ ఈరోజు తుది శ్వాస విడిచారని సమాచారం. ప్రస్తుతం ఢిల్లి టూర్ లో ఉన్న సిఎం కే.సి.ఆర్ సోదరి మరణ వార్త విని హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారట.

లీలమ్మ మృతి పట్ల కే.సి.ఆర్ కుటుంబ సభ్యులలో విషాద చాయలు అలముకున్నాయి. మరి ఆమె మరణానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. సిఎం కే.సి.ఆర్ సోదరి మరణం పట్ల చాలా బాధపడుతున్నారట.

5

Leave a comment