కన్నతల్లిని అవమానించిన కత్తి మహేష్.. లైవ్ లో దొరికిపోయాడు..!

kathi mahesh

కొన్నాళ్లుగా పవన్ మీద అతని ఫ్యాన్స్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్ కు నిన్న సరైన కౌంటర్ వేశారు దర్శకుడు వివేక్. నిన్న పూనం కౌర్ పై 6 ప్రశ్నలంటూ చేసిన హంగామా తెలిసిందే. ఆ తర్వాత టివి-9 మహేష్ కత్తిని ద్దాదాపు 4,5 గంటల పాటు చర్చల్లో ఉంచింది. అది సరిపోదు అన్నట్టుగా రాత్రి మహా న్యూస్ లో కూడా లైవ్ లోకి వచ్చాడు కత్తి మహేష్.

అక్కడ డైరక్టర్ వివేక్ కత్తి మహేష్ ను తన తల్లి గురించి ఓ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరారు. దానికి కత్తి మహేష్ నిరాకరించారు. అయితే వివేక్ చెప్పాల్సిందే అని.. ఇతరుల జీవితాలపై ప్రశ్నలగిడే హక్కున్న మీరు మీ తల్లి గురించి దాయాల్సిన అవసరం ఏముంటుందని ఎటాక్ చేశాడు. అయితే విషయం ఏదో తేడా కొడుతుండటంతో స్టూడియో నుండి వాకవుట్ చేశాడు కత్తి మహేష్.

మొదటిసారి కత్తి కాస్త తగ్గినట్టు అనిపించిన సందర్భం ఇదే అని చెప్పొచ్చు. ఇంతకీ కత్తి తల్లి గురించి మాట్లాడటానికి ఎందుకు నిరాకరించాడు. తల్లి గురించి చెప్పుకోలేని కత్తి మహేష్ ఎందుకు పవన్ పై ఈ రాద్ధాంతం చేస్తున్నాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Leave a comment