గుణ 369 టీజ‌ర్‌… కార్తీకేయ మ‌ళ్లీ పిడి వేసేశాడుగా…

గుణ 369 టీజ‌ర్‌… కార్తీకేయ మ‌ళ్లీ పిడి వేసేశాడుగా…

యంగ్ హీరో కార్తీకేయ Rx100 సినిమాతో యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ ఒక్క సినిమా కార్తీకేయ‌ను సూప‌ర్ పాపుల‌ర్ చేసేసింది. కంప్లీట్ బోల్డ్ స్టోరీతో వ‌చ్చిన ఈ సినిమాలో కార్తీకేయ కండ‌లు చూసిన యూత్ ఫిదా అయిపోయారు. అదే క్రేజ్‌ను కంటిన్యూ చేయాల‌ని తాజాగా హిప్పీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌ళ్లీ అదే బోల్డ్ స్టోరీని, అదే బాడీని చూపించే స్టైల్‌ను కంటిన్యూ చేయ‌డంతో హిప్పీ రిజ‌ల్ట్ తేడా కొట్టేసింది.

హిప్పీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. హిప్పీ వ‌చ్చి వారం రోజులు కూడా కాకుండానే కార్తీకేయ కొత్త సినిమా గుణ 369 టీజ‌ర్ వ‌దిలేశాడు. సోమ‌వారం రిలీజ్ అయిన టీజ‌ర్ చూస్తుంటే ప‌ర‌మ రొటీన్ ల‌వ్ & యాక్ష‌న్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా అని తెలుస్తోంది. హిప్పీ త‌లాతేకా లేని క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌స్తే ప్రేక్ష‌కుడు తిర‌స్క‌రించాడు. ఇప్పుడు ప‌ర‌మ మూస రెగ్యుల‌ర్ టాలీవుడ్ ఫార్మాట్లో గుణ తెర‌కెక్కించిన‌ట్టు చెపుతోంది.

టీజ‌ర్‌లో మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితానికి ఎలాంటి ప్ర‌మాదం జ‌రిగినా ప‌ర్వాలేదు…. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఎలాంటి హానీ జ‌ర‌గ‌కూడ‌దు. – నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇలా ష‌ట్ట‌ర్ క్లోజ్ చేసి బ‌ల‌వంతంగా ఓ అమ్మాయితో మాట్లాడ‌తాన‌ని.. నాతో మీరు మాట్లాడాల్సిన ప‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి అంటూ చెప్పే డైలాగులు కొత్త‌గా ఏం లేవు. చివ‌ర్లో వ‌చ్చిన డైలాగ్ కూడా అంతే.

హీరోయిన్ల‌తో ల‌వ్ ట్రాక్‌, సెల్ఫీలు, సీక్రెట్ వ్య‌వ‌హారాలు, చివ‌ర‌కు ఈ ప్రేమ‌ను ద‌క్కించుకునేందుకు యాక్ష‌న్ ఇదే త‌ర‌హాలో గుణ 369 సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్ చెప్పేసింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వ‌క‌పోతే కార్తీకేయను ప‌ట్టించుకునే వారు ఉండ‌రేమో.

Leave a comment