Moviesటీజర్ టాక్: దొంగ అవతారమెత్తిన ఖైదీ

టీజర్ టాక్: దొంగ అవతారమెత్తిన ఖైదీ

తమిళ హీరో కార్తీ నటించిన రీసెంట్ మూవీ ఖైదీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కార్తీ యాక్టింగ్ కూడా అదిరిపోయే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురిపించారు. దీంతో కార్తీ కెరీర్‌లోనే తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరింది. ఇక కార్తీ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేస్తున్నాడు.

దొంగ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీతో పాటు జ్యోతిక కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కినట్లు స్పష్టం అవుతోంది. చిన్నప్పుడే విడిపోయిన అక్కాతమ్ముడు, తిరిగి ఎలా కలుసుకున్నారనే విషయాన్ని ఈ సినిమాలో మనకు చూపించనున్నాడు దర్శకుడు జీతు జోసెఫ్.

సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు కార్తీ రెడీ అవుతున్నాడు. మరి దొంగ చిత్రంతో కార్తీ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news