Moviesకణం : రివ్యూ & రేటింగ్

కణం : రివ్యూ & రేటింగ్

నాగ శౌర్య, సాయి పల్లవి లీడ్ రోల్ లో థ్రిల్లర్ కథగా వచ్చిన సినిమా కణం. విజయ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. తమిళంలో దియా, తెలుగులో కణం పేరుతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

కృష్ణ (నాగ శౌర్య), తులసి (సాయి పల్లవి) చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లికి ముందే ఒకరిలో ఒకరు ఏకమవడం వల్ల తులసి గర్భవతి అవుతుంది. పేరెంట్స్ వారిద్దరిని దూరం చేస్తారు. కడుపులో ఉన్న పిండాన్ని అబార్షన్ ద్వారా తీసేస్తారు. ఐదేళ్ల తర్వాత కృష్ణ, తులసిలకు పెళ్లి చేస్తారు. అయితే అబార్షన్ చేయించిన పాప ఆత్మగా మారి తనని తీసేయాలన్న ఆలోచన వచ్చిన వారందరిని చంపేస్తుంది. ఈ క్రమంలో హీరోని కూడా చంపాలని చూస్తుంది. ఇంతకీ ఆత్మ నుండి హీరోని తులసి ఎలా కాపాడింది అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

నాగ శౌర్య కెరియర్ లో ఇలాంటి పాత్ర చేయలేదు. సినిమా అంతా సీరియస్ గా కనిపిస్తాడు. ఇక సాయి పల్లవి మరో మంచి పాత్రతో వచ్చింది. సినిమా అంతా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. బేబీ విరోనికా కూడా చాలా చక్కగా చేసింది. ప్రియదర్శి పాత్ర కూడా బాగుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు సంగీతం బాగా హెల్ప్ అయ్యింది. ప్రతి సీన్ కు బ్యాక్ గ్రౌండ్ షోర్ మంచి ఫీల్ కలిగించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. భ్రూణ హత్యల మీద దర్శకుడు రాసుకున్న కథ బాగా వర్క్ అవుట్ అయ్యింది. కథనంలో కూడా లేనిపోని ఆర్భాటాలు లేకుండా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

విశ్లేషణ :

భ్రూణ హత్యల మీద డైరక్టర్ విజయ్ ఎంచుకున్న కథ బాగుంది. అబార్షన్ అన్నది చాలా సింపుల్ అయిన ఈరోజుల్లో అది చేయాలంటే భయపడేలా సినిమా కథ, కథనాలు ఉన్నాయి. థ్రిల్లర్ కథ అనగానే ఆత్మ రాగానే అరుపులు కేకలు అలా కాకుండా ప్రేమగా కనిపించడం విశేషం.

సినిమా అంతా సాయి పల్లవి, వినోనికాల మీద నడిపించాడు దర్శకుడు. కాన్సెప్ట్ బయటకు రాకుండా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నాగ శౌర్యకు తప్పకుండా ఇది కొత్త సినిమా అవుతుంది. సాయి పల్లవి తన టాలెంట్ మరోసారి చూపించేసింది. థియేటర్ దాకా వెళ్తే సినిమా అందరికి నచ్చే అవకాశం ఉంది. సినిమా క్లైమాక్స్ కూడా బాగా రాశాడు దర్శకుడు. ఇలాంటి కథకు ఇలాంటి ముగింపే అని కన్విన్స్ అయ్యేలా చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

నాశుర్య, సాయి పల్లవి, వినోరికా

టెక్నికల్ టీం

డైరక్షన్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ కాస్త స్లో అవడం

రెగ్యులర్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు లేకపోవడం

బాటం లైన్ :

కణం.. మనసుని కదిలించే సినిమా..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news