Moviesకళ్యాన్ దేవ్ 'విజేత' రివ్యూ

కళ్యాన్ దేవ్ ‘విజేత’ రివ్యూ

మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన సినిమా విజేత. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతున్న హీరో (కళ్యాణ్ దేవ్) ప్రస్తుతం యువత ఆలోచన విధానంతో జాలీగా రోజులు గడుపుతుంటాడు. లైఫ్ లో సెటిల్ అవ్వాలన్న తండ్రి (మురళి శర్మ) మాటలను పెడచెవినపెడుతూ వస్తాడు. ఇంతలోనే పక్కింటి అమ్మాయి మాళవిక నాయర్ ను చూసి ఇష్టపడతాడు హీరో. ఓ బిజినెస్ ప్లాన్ చేయగా అది సక్సెస్ అవదు. ఇక ఫైనల్ గా తండ్రి అతని మీద ఆశలన్ని చంపుకోగా తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని హీరోయిన్ సాయం పొందుతాడు. తండ్రిని మెప్పించేలా హీరో లైఫ్ ఎలా సెటిల్ అయ్యాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

కళ్యాణ్ దేవ్ మొదటి సినిమానే కాబట్టి సాధ్యమైనంత వరకు నటిస్తున్నాడని తెలుస్తుంది. హీరోగా ఓకే అనిపించుకున్నాడు కళ్యాణ్. ఇక హీరోయిన్ గా మాళవిక నాయర్ పర్వాలేదు. సహజ నటనతో ఆకట్టుకుంది. సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మురళి శర్మ తన నటనతో మెప్పించాడు. నాజర్, తణికెళ్ల భరణి కూడా ఎప్పటిలానే తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

హర్షవర్ధన్ రామేశ్వర్ సాంగ్స్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. బాహుబలి తర్వాత విజేత సినిమా చేయడం విశేషం. దర్శకుడు రాకేష్ శషి కథ, కథనాల్లో సహజత్వానికి దగ్గరగా సీన్స్ రాసుకున్నాడు కాని వాటిని ఆడియెన్స్ కు చేరవేయడంలో విఫలమయ్యాడు. సినిమా కథ కూడా గొప్పగా అనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

తండ్రి, కొడుకుల మధ్య ఎన్నో సెంటిమెంట్ సినిమాలు వచ్చాయి. వాటిలానే విజేత కూడా తండ్రి బాధ్యత తీసుకుని జీవితంలో విజేతగా ఎలా ఎదిగాడు అన్నది ఈ సినిమా కథ. సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సన్నివేశాలు మధ్యతరగతి ఆడియెన్స్ కు బాగా నచ్చేస్తాయి. ఎమోషనల్ గా బాగా వర్క్ అవుట్ అయ్యినా కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అంత కిక్ అనిపించదు.

ఇక హీరోగా కళ్యాణ్ దేవ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అతన్ని ప్రమోట్ చేయడమే బాధ్యతగా ప్రతి సీన్ లో అతన్ని చూపించడం జరిగిందని చెప్పొచ్చు. అయితే అతని డిక్షన్, డైలాగ్ డెలివరీ కొంత వరకు ఓకే అనిపించినా ఇంకాస్త హార్డ్ వర్క్ చేయాల్సిందని అనిపిస్తుంది. సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ కూడా అంత క్రేజీ గా ఉండవు.

సినిమా మొత్తం కళ్యాణ్ దేవ్ మీదనే నడుస్తుంది. మొదటి సినిమా వన్ మ్యాన్ షో చేయడం కష్టమే అయితే సినిమా కథ, కథనాలు కొత్తగా అనిపించకపోవడం కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటివి సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను రీచ్ అవలేదు.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ దేవ్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

కళ్యాణ్ దేవ్ ‘విజేత’.. జస్ట్ ఓకే..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news