మళ్లీ పాత ఫార్ములాలో నందమూరి హీరో!

131

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల 118 అనే సినిమాతో విజయం సాధించాడు. కాగా చాలా గ్యాప్ తరువాత హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. అయితే మరోసారి పాత ఫార్ములాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వంలో రాబోయే సినిమాలో కళ్యాణ్ రామ్ మరోసారి డ్యుయల్ రోల్‌లో నటించనున్నాడు.

‘తుగ్లక్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి డ్యుయెల్ రోల్‌లో అలరించనున్నాడు. పూర్తిగా సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ గతంలో కూడా డ్యుయెల్ రోల్‌లో నటించాడు. హరేరామ్ అనే సినిమాలో డ్యుయెల్ రోల్‌ చేసిన కళ్యాణ్ రామ్.. ఆ సినిమా దెబ్బకు మళ్లీ డ్యుయెల్ రోల్‌లో కనిపించలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు డ్యుయెల్ రోల్‌లో నటించనున్న కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా హరేరామ్ వంటి రిజల్ట్‌ను రిపీట్ చేస్తే.. ఈ నందమూరి హీరో డ్యుయెల్ రోల్ సినిమాలకు గుడ్ బై చెప్పడం ఖాయం అని అంటున్నారు సినీ క్రిటిక్స్.

Leave a comment