Gossips118 సినిమాతో కళ్యాణ్ రామ్ కు చెమటలు..

118 సినిమాతో కళ్యాణ్ రామ్ కు చెమటలు..

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు బాలయ్య, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటున్నాడు కళ్యాణ్ రాం.

కళ్యాణ్ రాం ఇదవరకు ఎప్పుడు చేయని సస్పెన్స్ థ్రిల్లర్ కథ 118. సినిమా ఫస్ట్ టూ లాస్ట్ వరకు స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందని అంటున్నారు. ఈసారి కళ్యాణ్ రాం కాన్ ఫిడెన్స్ చూస్తుంటే తప్పకుండా 118తో అనుకున్న హిట్ కొట్టేలా ఉన్నాడు. కెమెరా మెన్ గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న గుహన్ ఈ సినిమా ఆడియెన్స్ మెప్పించేలా తెరకెక్కించారని తెలుస్తుంది. ఆల్రెడీ సినిమా చూసిన తారక్ తప్పకుండా కళ్యాణ్ రాం కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందని.. అందించాలని అన్నాడు.

కళ్యాణ్ రాం కూడా సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతున్న తీరుని చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా అతని కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచేలా ఉందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుంది అన్నది ఈ శుక్రవారం తెలుస్తుంది. 118 సినిమాలో షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news