చిరు ని వాడుతున్న కళ్యాణ్..!

kalyan-dev-new-movie-title-vijetha

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్న వార్తల్లు అప్పట్లో హడావిడి చేశాయి. అనుకున్నట్టుగానే మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తెరంగేట్రం సిద్ధమైంది. రాకేష్ శషి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి ఆస్థాన కెమెరామన్ సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.

ఇక సినిమా టైటిల్ గా విజేత అని పెట్టారు. ముందునుండి అనుకున్నట్టుగా ఇదో తండ్రికొడుకుల సెంటిమెంట్ తో వస్తుందని టైటిల్ పోస్టర్ తో కూడా చెప్పారు. టైటిల్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే కనిపిస్తుంది. మెగా అల్లుడిగా మెగాస్టార్ టైటిల్ తోనే కళ్యాణ్ దేవ్ రావడం చూస్తుంటే ఇతన్ని కూడా మెగా ఫ్యాన్స్ తప్పక అభిమానిస్తారని చెప్పొచ్చు.

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరి మెగా అల్లుడు విజేత అవుతాడా లేడా అన్నది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాకే తెలుస్తుంది.

Leave a comment