Gossipsఆ ఒక్కటి పండితే.. జై సింహా సూపర్ హిట్టే..!

ఆ ఒక్కటి పండితే.. జై సింహా సూపర్ హిట్టే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. జనవరి 12న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. సినిమా నిర్మాత సి.కళ్యాణ్ కూడా సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా విశేషాలను కూడా షేర్ చేసుకున్న కళ్యాణ్ సినిమాలో సెంటిమెంట్ అదిరిపోతుందని.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటాయని అన్నారు.

ముఖ్యంగా బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్న సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి జై సింహా కూడా ఆ లెక్కన హిట్ అంటున్నారు కళ్యాన్. ఇక సినిమాలో నయనతార, ప్రకాశ్ రాజ్ పాత్రలు చాలా ఇంపార్టెంట్ అని.. సినిమాకు వారు లేకుంటే సినిమా లేదని అన్నారు కళ్యాణ్. ఇక చిరంతన్ భట్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యిందని.. యువ హీరోలకు పోటీగా బాలకృష్ణ ఈ సినిమాలో స్టెప్పులేశారని అన్నారు.

మంచి కథ కథనాలతో వస్తున్న ఈ సినిమా బాలయ్యకు హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. నయనతారతో పాటు హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news