ఎత్తేసిన కథతో కల్కి తీశారా.. రిలీజ్ డౌటే అట..!

50

యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా కల్కి. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో అదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న ఇలాంటి టైంలో సినిమా కథ నాదంటూ కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే వ్యక్తి గొడవ మొదలు పెట్టాడు.

కల్కి సినిమా కథ 2009లోనే తాను రైటర్స్ అసోషియేషన్ లో రిజిస్టర్ చేయించానని.. ఇప్పుడు ఆ కథనే అటు ఇటుగా మార్చి కల్కి సినిమా చేస్తున్నారని అన్నాడు కార్తికేయ. రాజశేఖర్ మహాంకాళి సినిమాకు రైటర్ గా పనిచేశాడు. కాని ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. రాజశేఖర్ తో తాను కల్కి సినిమా కథ చెప్పానని ప్రశాంత్ వర్మ ఈ సినిమా డైరెక్ట్ చేశాడని అంటున్నాడు కార్తికేయ.

అ! సినిమాతో ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ తన క్రియేటివిటీతో కల్కి కథ రాశాడని అనుకున్నారు. కాని అతను కూడా ఎత్తేసిన కథతో సినిమా తీస్తాడని ఎవరు ఊహించి ఉండరు. కార్తికేయ మాత్రం తన దగ్గర కథ రిజిస్టర్ చేయించిన కాపీలున్నాయని. రైటర్స్ రిజిస్టర్ లో ఈ విషయంపై ప్రస్థావించినా సినిమాకు సంబందించిన వాళ్లెవ్వరు స్పందించడం లేదని అంటున్నాడు. మరి రాజశేఖర్ అండ్ టీం కార్తికేయ అలిగేషన్స్ మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a comment