ఆ విషయంలో రికార్డు సృష్టించిన కల్కి..

44

యాంగ్రీ యంగ్‌మేన్ రాజ‌శేఖ‌ర్ కెరీర్ ఆల్‌మోస్ట్ అయిపోయింద‌నే అంద‌రూ అనుకున్నారు. ప‌దేళ్ల పాటు ఎలాంటి హిట్ లేకుండా అంద‌రూ మ‌ర్చిపోయిన రాజ‌శేఖ‌ర్ గ‌రుడవేగ సినిమాతో స‌త్తా చాటాడు. ఇప్పుడు
గరుడవేగ సినిమాకు ముందు, ఆ సినిమా తర్వాత అన్నట్టు మారింది రాజశేఖర్ మార్కెట్. ఆ సినిమా ఎఫెక్ట్ రాజ‌శేఖ‌ర్ కెరీర్‌పై చాలా ఉంద‌నే చెప్పాలి.

త‌న‌కు తాను సొంతంగా రెమ్యున‌రేష‌న్ పెంచుకోవ‌డంతో పాటు ఇప్పుడు ఆయ‌న చేస్తోన్న సినిమాల బిజినెస్‌లు బాగా జ‌ర‌గడం వెన‌క గ‌రుడ‌వేగ హిట్ పుణ్య‌మే అనుకోవాలి. ఇక రాజ‌శేఖ‌ర్ లేటెస్ట్ మూవీ క‌ల్కి ప్రి రిలీజ్ బిజినెస్ విష‌యంలో రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఇప్ప‌టికే థియేట్రిక‌ల్ రైట్స్ హోల్‌సేల్‌గా అమ్ముడ‌య్యాయి.

ఇప్పుడు శాటిలైట్, డిజిటల్ డీల్స్ అయిపోయాయి. గ‌రుడ‌వేగ హిట్ అయ్యే వ‌ర‌కు ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ఎవ్వ‌రూ కొన‌లేదు. ఆ సినిమాకు హిట్ టాక్ వ‌చ్చాక శాటిలైట్‌కు భారీ లాభాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఆ సినిమా ఎఫెక్ట్‌తో క‌ల్కి బిజినెస్ రిలీజ్‌కు ముందే క్లోజ్ అయిపోయింది. క‌ల్కి శాటిలైట్ రైట్స్ స్టార్ మా ఛానెల్ ద‌క్కించుకుంది.

శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్సే రూ.6 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఇక హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ ఎప్పుడో సేల్ అయ్యాయి. ఏదైనా బెల్లం చుట్టూ ఈగ‌లు అన్న‌ట్టు స‌క్సెస్‌కు ఎలాంటి రేటు ఉంటుందో మ‌రోసారి రాజ‌శేఖ‌ర్ విష‌యంలో ఫ్రూవ్ అయ్యింది. ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా 28న థియేటర్లలోకి వస్తోంది.

Leave a comment