ఆ స్టార్ డైరక్టర్ కు చుక్కలు చూపించిన కాజల్..!

6

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఇప్పుడు కాజల్ అగర్వాల్ మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. స్టార్ హీరోలతో పాటుగా యువ హీరోలతో కూడా జోడి కడుతూ కాజల్ కెరియర్ దూసుకెళ్తుంది. హీరోయిన్ గా 50 సినిమాలను పూర్తి చేసుకున్న కాజల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు సినిమాల్లో చేస్తుంది. ఫుల్ ఫాంలో ఉన్న కాజల్ అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఆఫర్ తిరస్కరించిందట.

బాలీవుడ్ క్వీన్ రీమేక్ చేస్తున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమా తర్వాత యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ తో చేసే సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను అడిగారట. అందుకు కాజల్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చిందట. తన కెరియర్ ఇంకొన్నాళ్లు కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్ననని ఈ సినిమా చేయనని చెప్పిందట కాజల్. కాజల్ ఆన్సర్ కు దర్శకుడు కంగుతిన్నాడట.

ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ! సినిమాలో కూడా కాజల్ నటించింది. అయితే నాని నిర్మాత కాబట్టి ఆ సినిమాకు ఆమె 10 రోజుల డేట్స్ ఇచ్చిందట. రాజశేఖర్ పక్కన మాత్రం నటించేది లేదని కరాకండిగా చెప్పేసిందట కాజల్.

Leave a comment