Gossipsఆ విషయంలో కాజల్ బాధపడుతోందా ...?

ఆ విషయంలో కాజల్ బాధపడుతోందా …?

వెండి తెర చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని … సీనియర్ హీరో ల నుంచి యంగ్ హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి మెప్పించింది. తన సహజమైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేయం లో ఈ చందమామ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ… ఎప్పటికప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ… ముందుకు వెళ్తోంది.

అయితే ఈ అందాల చందమామ… ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ‘సీత’గా కనిపించేందుకు సిద్దమయ్యింది. అంతే కాకుండా తమిళ వర్షన్‘క్వీన్‌’లోనూ ఆమెనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విషయానికి వస్తే…. ఓ విషయంలో కాజల్ చాలా బాదపడిపోతున్నట్టుగా ఆమె కొన్ని రకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాభై, వంద.. ఇలా ఎన్ని సినిమాలు చేసినా, గుర్తుండిపోయే సినిమాలు మాత్రం నాలుగో అయిదో ఉంటాయి. అది హీరోయిన్స్ తప్పు కాదు.

ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని మేమూ కోరుకుంటాము కానీ…. కానీ … అటువంటి పాత్రలను దర్శకులు, రచయితలు మాకోసం రాయాలి కదా ! ఆలా చేస్తే మేము కూడా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా మా టాలెంట్ చూపిస్తాం అంటూ… బాధగా చెప్తోంది ఈ ‘సీత’.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news