Gossipsకోలీవుడ్ స్టార్ హీరో ప్రేమలో కాజల్..!

కోలీవుడ్ స్టార్ హీరో ప్రేమలో కాజల్..!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెళుగుతున్న కాజల్ అగర్వాల్ దశాబ్ధం పైగా కెరియర్ కొనసాగిస్తున్నా ఇప్పటికి స్టార్ హీరోయిన్ గానే ఛాన్సులు అందుకుంటుంది. ఎప్పుడు తనకు నచ్చిన హీరో గురించి చెప్పేందుకు ఇబ్బంది పడే కాజల్ రీసెంట్ గా ఓ ఇంటవ్యూలో తనకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయన సింప్లిసిటీ.. యాక్టింగ్.. ఇవన్ని తనకు ఇష్టమని.. అతనితో నటిస్తుంటే చాలా బాగుంటుందని అంటుంది కాజల్.

ఇక విజయ్ తర్వాత అజిత్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో వివేకం సినిమాలో నటించానని.. అంతకుముందు అజిత్ గురించి విన్నాను కాని ఆయనతో పనిచేశాక ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలిసింది. కోలీవుడ్ లో ఈ ఇద్దరి స్టార్ అంటే తనకు చాలా ఇష్టమని వారితో తాను ప్రేమలో పడ్డానని చెబుతుంది కాజల్. మరి అమ్మడికి హీరోయిన్ గా మొదటి ఛాన్స్ ఇచ్చింది టాలీవుడ్. స్టార్ హీరోయిన్ చేసింది కూడా తెలుగు పరిశ్రమే.

మరి ఇక్కడ హీరోలెవరు తనకు నచ్చలేదు కాబోలు.. అవకాశాలు ఇక్కడ అందుకుని స్టార్ గా ఎదిగాక ఛాన్సులు ఇచ్చిన కోలీవుడ్ ను తెగ పొగిడేస్తుంది కాజల్. ప్రస్తుతం తెలుగులో సీత సినిమా చేస్తున్న కాజల్ ఆ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో క్లోజ్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఆ రిలేషన్ ఏంటన్నది వారు బయటపెట్టాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news