Gossipsకాజల్ మాయలో ఆ నిర్మాత కొడుకు.. పట్టుబట్టి మరి దానికి ఒప్పించాడట..!

కాజల్ మాయలో ఆ నిర్మాత కొడుకు.. పట్టుబట్టి మరి దానికి ఒప్పించాడట..!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అందం అభినయం ఉన్న సిని తారగా సౌత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ భామ కుర్ర హీరోల సరసన కూడా నటించేందుకు సై అంటుంది. ఇక ఇప్పుడు ఓ నిర్మాత కొడుకు డెబ్యూ మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

కాజల్ ఎంపికలో ఆ నిర్మాత కొడుకు ఇంట్రెస్ట్ ఉందట. కాజల్ సినిమాలను చూస్తూ ఆమె మీద ఆ నిర్మాత కొడుకు ప్రేమలో పడ్డాడట. అందుకే నిర్మాత కొడుకు హీరోగా మొదటి సినిమాలోనే కాజల్ తో రొమాన్స్ కు సిద్ధమయ్యాడట. ఇంతకీ కాజల్ తో జోడి కట్టే నిర్మాత కొడుకు ఎవరంటే డివివి దానయ్య తనయుడే అని తెలుస్తుంది.

బడా నిర్మాతగా దానయ్య గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తండ్రి సపోర్ట్ తో దానయ్య కొడుకు హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. దర్శకుడు తేజ చెప్పిన కథ నచ్చడంతో దానయ్య తనయుడితో సినిమా ఫిక్స్ చేశాడట. సినిమాలో హీరోయిన్ గా కాజల్ కావాలని హీరో గారి కోరికట. పట్టుబట్టి మరి ఆమెని ఒప్పించారని టాక్. అంతేకాదు యువ హీరో పక్కన కాబట్టి అమ్మడి డిమాండ్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news