Gossipsబాబోయ్ ఆ పుకార్లు నమ్మకండి : కాజల్

బాబోయ్ ఆ పుకార్లు నమ్మకండి : కాజల్

టాలీవుడ్ లో అందాల అపురూప కలువ కళ్ల సుందరిగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కాజల్ కి ఇప్పుడు తెలుగు పెద్దగా అవకాశాలు రావడం లేదు. మెగా ఫ్యామిలీ హీరోలందరితో నటించిన కాజల్ కొంత కాలంగా తమిళంలోనే నటిస్తుంది. ఆ మద్య బాలీవుడ్ లోకి వెళ్లినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.

ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’అట్టర్ ఫ్లాప్ కావడంతో మరోసారి కాజల్ కెరీర్ కాంట్రవర్సీలో పడింది. ఇప్పటికే నానా ఇబ్బందుల్లో ఉన్న కాజల్ కి మరో పిడుగు లాంటి వార్త మింగుడు పడకుండా ఉంది. సోషల్ మీడియాలో ఈ మద్య భారతీయుడు 2 నుంచి కాజల్ ఔట్ అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ విషయంపై స్పందించిన కాజల్..ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని..త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంబం కాబోతుందని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు జయం రవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి ‘కోమలి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news