ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ మాయ‌లో స్టార్ హీరోయిన్‌..

35

సీనియ‌ర్ హీరోయిన్ కాజ‌ల్ కొద్ది రోజుల క్రితం తను నిర్మాతగా మారి సినిమాలు నిర్మించబోతున్నానన్న విష‌యం చెప్పింది. త‌న బ్యాన‌ర్‌కు కేఏ వెంచ‌ర్స్ అన్న పేరు కూడా పెడుతున్నాన‌ని చెప్పింది. వామ్మో కాజ‌ల్‌కు మంచి టేస్టే ఉంద‌ని అంద‌రూ గుస‌గుస‌లాడుకున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు ఆమె తేజ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా నిర్మించేందుకు రెడీ అయిపోయింద‌ట‌. ఈ వార్తే ఇప్పుడు అంద‌రికి గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ‌ప‌డిన‌ట్ల‌య్యింది.

త‌న‌కు లైఫ్ ఇచ్చిన తేజ‌ను కాజ‌ల్ బాగా న‌మ్మేసింద‌ని… వీరి మ‌ధ్య ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని అంటున్నారు. ఇక తేజ ప‌దేళ్లుగా వ‌రుస ప్లాపులు ఇచ్చి.. ఇచ్చి ఎట్ట‌కేల‌కు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టాడు. మ‌ళ్లీ రీసెంట్‌గా సీత సినిమా చేశాడు. ఈ రెండు సినిమాల్లోనూ కాజ‌లే హీరోయిన్‌. ఈ రెండు సినిమాల్లో కాజ‌ల్ పాత్రే హైలెట్‌.

ఇప్పుడు ఆమెతోనే ఓ లేడీ ఓరియంటెడ్ ప్లాన్ చేశాడ‌ట‌. తేజ క‌థ కాజ‌ల్‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేయ‌డంతో ఈ సినిమాకు తానే నిర్మాత‌గా ఉంటాన‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కాజ‌ల్ నిర్మాత‌గా మార‌డం బాగానే ఉన్నా తేజ లాంటి ప్లాప్ ద‌ర్శ‌కుడిని ఆమె ఎలా ? ఎంచుకుందా ? అన్న‌దే ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. తేజకు మార్కెట్, క్రేజ్ రెండూ లేవు. తాను క‌ష్టాల్లో ఉన్న ప్ర‌తిసారి ఛాన్సులు ఇచ్చి ఆదుకున్నాడ‌ని తేజ‌ను ఆమె గుడ్డిగా న‌మ్మేసింద‌న్న గుస‌గుస‌లు టీ టౌన్‌లో వినిపిస్తున్నాయి.

Leave a comment