Gossipsకాజల్ కు అన్యాయం చేసిన రణరంగం..!

కాజల్ కు అన్యాయం చేసిన రణరంగం..!

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా రణరంగం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు సమాన పాత్రలు ఉన్నా ఫైనల్ కట్ చూసుకున్నాక కళ్యాణి ఎపిసోడ్స్ బాగున్నాయని కాజల్ సీన్స్ కొన్ని కట్ చేశారు. రణరంగం సినిమా చూసిన ప్రేక్షకులు ఇంత చిన్న పాత్రకు కాజల్ ఎలా ఒప్పుకుంది అని అనుకుంటున్నారు.

అయితే ఈ వార్తలకు సమాధానంగా సినిమా సక్సెస్ మీట్ లో శర్వానద్ కామెంట్స్ ఉన్నాయి. సినిమా రన్ టైం ఎక్కువవుతుందన్న కారణం చేత కాజల్ సీన్స్ కట్ చేశామని చెప్పుకొచ్చాడు. కళ్యాణితో చేసిన లవ్ సీన్స్ తన కెరియర్ లో ఇంతవరకు చేయని బెస్ట్ లవ్ సీన్స్ అని అన్నాడు. సినిమాటోగ్రఫీ బాగుందని రివ్యూస్ లో రాశారు. కథ విషయంలో శర్వానంద్ ఆలోచించాల్సింది అని కూడా రాశారు. మేము కొత్త కథో.. మెసేజ్ ఇచ్చే సినిమానో తీయలేదు.

బెస్ట్ క్వాలిటీ పిక్చర్ అందించాలని అనుకున్నాం ఆ విషయంలో మేము సక్సెస్ అయినట్టే అంటున్నారు. కాజల్ పాత్ర కావాలని ట్రిం చేశామని.. ఆమె కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు శర్వానంద్. మరి కాజల్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news