క్రికెటర్ ప్రేమలో కాజల్ అగర్వాల్..?

28

కాజల్ అగర్వాల్ ! తన అందచందాలు,చక్కని అభినయంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇండ్రస్ట్రీలో తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్‌లో మూడు సినిమాలతో యమా బిజీగా ఉంది ఈ బ్యూటీ. కమల్ హాసన్‌కు జోడిగా ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్, ‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’, ‘కోమలి’ సినిమాల్లోనూ నటిస్తోంది. ఆ మధ్య రిలీజైన ‘పారిస్ పారిస్’ టీజర్‌లో కాజల్ అగర్వాల్ ఎద అందాలను టచ్ చేస్తున్న సీన్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని, తల్లి కూడా అయిపొయింది. కాజల్ మాత్రం మూడు పదుల వయసు మీదపడిపోయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. తాను ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ జీవితంలో ఎప్పుడూ ఎవరితోనూ ప్రేమలో పడలేదా అని అడగగా.. ఓ స్టార్ క్రికెటర్ పై తాను తొలిసారి మనసు పడ్డానని కాజల్ ప్రకటించింది.

నేను ఈ విషయం ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇప్పటికే అతడికి పెళ్లి అయిపొయింది అంటూ తెగ బాదపడిపోయింది. ఇంతకీ ఈ అందాల బ్యూటీ మనసు దోచుకున్న ఆ అందగాడు మరెవరో కాదు టీం ఇండియా హిట్ మాన్ రోహిత్ శర్మ. అతగాడి మీద మనసుపడడమే కాదు, అతడి ఆటకు నేను వీరాభిమానిని. రోహిత్ ఎప్పుడు ఆడుతున్నా ఆ మ్యాచ్ మిస్ కాకుండా చూస్తుంటా అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

Leave a comment