Gossipsఆ స్టార్ హీరోతో లోకల్ బ్యూటీ మరోసారి..?

ఆ స్టార్ హీరోతో లోకల్ బ్యూటీ మరోసారి..?

Actress Kajal Aggarwal is currently busy with Megastar Chiranjeevi’s 150th movie. The actress has been roped in for a movie with superstar Mahesh Babu in Vamsi Paidipalli’s movie.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న స్టార్స్‌లో కాజల్ అగర్వాల్‌ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే టాలీవుడ్ జనాలకు అలవాటు పడిపోయిన కాజల్ తెలుగులో ఉన్న అందరు స్టార్ హీరోలతోనూ నటించి తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీతో నటించడానికి తెలుగు స్టార్ హీరోలు చాలా ఇష్టపడుతుంటారు. కాజల్ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్‌‌‌గా నిలవడంతో అమ్మడితో కలిసి రొమాన్స్ చేయడానికి యంగ్ హీరోలు కూడా పోటీపడుతుంటారు. అయితే ఇటీవల కాజల్‌కు తెలుగు సినిమాల్లో అవకాశాలు కొంతవరకు తగ్గాయి. దీంతో అమ్మడికి జనాల పల్స్ బాగా తెలిసిన కాజల్ ఉన్నఫలంగా ఫస్ట్‌టైమ్ ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయింది. అది కూడా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో ‘పక్కా లోకల్’ అనే పాటతో రచ్చ రచ్చ చేసింది కాజల్. ఈ పాట సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ఆఫర్లు వచ్చి ఆమె ముందు వాలుతున్నాయి.

తాజాగా కాజల్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందో లేదో మరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. అయితే ప్రిన్స్‌తో కాజల్ ఇప్పటికే పలు సినిమాలు చేసింది. ఇక ఇఫ్పుడు ఓ సూపర్ హిట్ ఐటెం సాంగ్ తరువాత మహేష్ తో చేయబోయే సినిమాలో కాజల్ అందాల ఆరబోతకు సై అంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కాజల్, మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news