Newsటాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్

Kajal Agarwal revealed her opinions on Telugu star heroes in live interview.

వెండితెరపై గానీ, ఇతర ఈవెంట్లలోగానీ హీరోయిన్లు తమ తోటి కథానాయకులతో సరదాగా, స్నేహభావంగా కనిపిస్తుంటారు. అయితే.. వ్యక్తిగతంగా ఆయా హీరోలపై హీరోయిన్ల అభిప్రాయాలేంటి? అనే ప్రశ్న ప్రతిఒక్కరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఇంకేముంది.. సమయం వచ్చినప్పుడల్లా ఆ ప్రశ్న ప్రతి హీరోయిన్‌కి సంధిస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు కాజల్‌తో చిట్‌చాట్ చేసే టైం దొరకడంతో.. ఆమెకు ఆ ప్రశ్న ప్రతి హీరో ఫ్యాన్ నుంచి ఎదురైంది. వాటన్నింటికీ ఈ అమ్మడు.. తీరిగ్గా సమాధానాలు చెప్పింది. ఒక్కొక్క హీరోపై ఆమె వెల్లడించిన అభిప్రాయాలేంటో తెలుసుకుందాం పదండి..

1. మహేష్ బాబు : చాలా అందగాడు
2. పవన్ కళ్యాణ్ : క్రియేటివ్, చాలా ప్రొఫెషనల్
3. ఎన్టీఆర్ : ఎంతో ప్రతిభావంతుడు
4. ప్రభాస్ : బాహుబలి
5. రామ్ చరణ్ : బహుముఖ ప్రజ్ఞశాలి

కేవలం హీరోల మీదే కాకుండా తనకిష్టమైన కథానాయికల గురించి కూడా కాజల్ చెప్పుకొచ్చింది. ‘ఒకవేళ మీరు అబ్బాయి అయివుంటే.. మీ ఫస్ట్ క్రష్ (లవ్) ఎవరు?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ప్రియాంక చోప్రా అని చెప్పింది. ఇక సమంత గురించి అభిప్రాయం అడగ్గా.. ఆమె చాలా హార్డ్ వర్కర్ అని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news