Gossipsకత్తిలాంటి కాజల్ ఎన్టీఆర్ కోసం అందుకు మళ్లీ సై అంది..!

కత్తిలాంటి కాజల్ ఎన్టీఆర్ కోసం అందుకు మళ్లీ సై అంది..!

రెండేళ్ల క్రితం కెరియర్ దాదాపు క్లోజ్ అన్నంతలా ఉన్న కాజల్ ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు హిట్ పడేసరికి మళ్లీ అమ్మడి రేంజ్ పెరిగింది. కెరియర్ ఆపేసి మ్యారేజ్ చేసుకోవాలనుకున్న అమ్మడు కాస్త పెళ్లి గిల్లి తర్వాత వచ్చి అవకాశాన్నల్లా చేసుకుంటూ పోతే బెటర్ అని అనుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే కెరియర్ లో ఎప్ప్పుడూ లేనిది జనతా గ్యారేజ్ కోసం ఐటం గాళ్ గా కూడా మారింది.

ఎన్.టి.ఆర్, కాజాల్ సిల్వర్ స్క్రీన్ సూపర్ హిట్ పెయిర్ అయిన ఈ జంట పక్కా లోకల్ సాంగ్ చించేశారు. ఇక ప్రస్తుతం అరవింద సమేత సినిమా కోసం కూడా కాజల్ ను ఐటం సాంగ్ చేసేలా ఒప్పించారట దర్శక నిర్మాతలు. దీనికోసం అమ్మడికి బాగానే ముట్టచెబుతున్నారని తెలుస్తుంది. మరి కత్తిలాంటి కాజల్ ను ఐటెం గా మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమా త్రివిక్రం మార్క్ తో పాటుగా ఎన్.టి.ఆర్ సినిమా పంథాలో కమర్షియల్ యాస్పెక్ట్ లో సాగుతుందట. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news